IPL 2024: ముంబైకు ఊహించని ఎదురు దెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆసీస్ స్టార్ బౌలర్ ఔట్

IPL 2024: ముంబైకు ఊహించని ఎదురు దెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆసీస్ స్టార్ బౌలర్ ఔట్

ఐపీఎల్ ప్రారంభం కాకుండానే స్టార్ ప్లేయర్ల గాయాలు ఫ్రాంచైజీలను కంగారు పెడుతున్నాయి. తాజాగా ఆసీస్ స్టార్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి తప్పుకున్నాడు. ఈ ఆసీస్ బౌలర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బెహ్రెన్‌డార్ఫ్ IPL  2023 సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 14 వికెట్లు పడగొట్టి ముంబై విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు.

బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ల్యూక్ వుడ్‌ను ఎంపిక చేసింది. ఈ ఇంగ్లీష్ పేసర్ 50 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరనున్నాడు. ఇంగ్లాండ్ తరపున వుడ్ రెండు వన్డేలతో పాటు.. ఐదు టీ20 మ్యాచులాడాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఎనిమిది వికెట్లు సాధించాడు. ప్రపంచ లీగ్ లో సత్తా చాటుతున్న ఈ ఇంగ్లాండ్ పేసర్.. ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ తరపున 12 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 

ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటికే శ్రీలంక లెఫ్టర్మ్ పేసర్ మధుశంక, సౌతాఫ్రికా పేస్ బౌలర్ కొయెట్జ్ గాయాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా  బెహ్రెన్‌డార్ఫ్ సీజన్ మొత్తానికి దూరం కావడం ఆ జట్టును కలవరానికి గురి చేస్తుంది. మార్చి 24 న గుజరాత్ తో ఈ  సీజన్ లో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.