
చంద్రగ్రహణం సంభవించేందుకు ఇంకా ఎంతో సమయం లేదు. ఈ రోజుసెప్టెంబర్ 7 వతేది రాత్రికి 9.58 గంటలకు ఏర్పడనుంది. ఈ గ్రహణం చాలా శక్తి వంతమైనది.. అందరిపై గ్రహణ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. గ్రహణ సమయంలో పట్టు స్నానం.. చేసిన ఈక్రింది తెలిపిన మంత్రాలు పఠిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ మంత్రాల గురించి తెలుసుకుందాం..
ఈ రోజు ( సెప్టెంబర్ 7) రాహు గ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిషం నక్షత్రంలో ఏర్పడుతుంది. శాస్త్రపరంగా, ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగుస్తుంది.
చంద్ర గ్రహణం సమయంలో ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, గాయత్రీ మంత్రం వంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
- ఓం నమో నారాయణ.. అడ్డంకులను అధిగమించి కెరీర్‌లో విజయం .... గ్రహణ దోషాలు తొలగిపోతాయి
- ఓం గం గణపతయే నమః ... గ్రహణం వల్ల కలిగే ఆటంకాలు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
- ఓం హ్రీం నమః శివాయ.. కుటుంబ ఆనందం , శ్రేయస్సు కోసం
- ఓం క్లీం కృష్ణాయ నమః.. స్పష్టత , విమర్శనాత్మక ఆలోచన కోసం
- ఓం సోమాయ నమః.. చంద్రుని రక్షణ , ఆశీర్వాదం కోసం
- ఓం హ్రీం సూర్యాయ నమః.. మంచి ఆరోగ్యం, కీర్తి మ, ప్రమోషన్ కోసం
- ఓం నమో భగవతే వాసుదేవాయ ... రుణ తగ్గింపు , పురోగతి కోసం
- ఓం మహా లక్ష్మీయై నమః... ఆదాయం , కుటుంబ శ్రేయస్సు కోసం.
- ఓం నరసింహాయ నమః... శత్రువులను అధిగమించి మానసిక బలాన్ని పొందడానికి
- ఓం విష్ణువే నమః.. ఆధ్యాత్మిక బలం, విద్య , ప్రయాణ ప్రయోజనాల కోసం
- ఓం శనిచారాయ నమః..శని ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి
- ఓం హ్రీం కాలికాయై నమః... ధైర్యం కోసం
- ఓం నమో భగవతే రామానుజాయ.. ఆధ్యాత్మిక వృద్ధి , మనశ్శాంతి కోసం
- ఓం నమః శివాయ ... రాహు...కేతువుల ప్రభావం తగ్గుతుంది
మృత్యుంజయ మంత్రం : ఓం త్య్రం బకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ...
ఉర్వారుకమివ్ బన్ధనన్మృత్యోర్ముక్షీయ మామృత్యత్ ।
ఇది జపించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మంత్రం భయంకరమైన గ్రహణ ప్రభావాల నుంచి కూడా రక్షణ ఇస్తుంది. ఇంకా ఆరోగ్యం , దీర్ఘాయువు, శ్రేయస్సు కలుగుతుంది.
చంద్ర బీజ మంత్రం: ఓం శ్రాం శ్రీం సః చంద్రమసే నమః ...చంద్రుడి అనుగ్రహం లభించడంతో పాటు మనసు శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది.
గాయత్రీ మంత్రం : ఓం భూర్భువః స్వాః । తత్సవితుర్వరేణ్యమ్... భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. ( యఙ్ఞోపవీతం ఉన్నవారు మాత్రమే దీనిని పఠించాలని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు)
దుర్గా మంత్రం : ఓం దున్ దుర్గాయై నమః ..అమ్మవారి అనుగ్రహంతో.. శత్రువులపై విజయం