మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం..  సూతకాలం మొదలయ్యే టైం దగ్గర పడింది.. 

మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం..  సూతకాలం మొదలయ్యే టైం దగ్గర పడింది.. 

ఖగోళశాస్త్ర ప్రకారం మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది.  వినాయక నిమజ్జనం కార్యక్రమాలను త్వరగా ముగించుకొని ఇంటికి చేరుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  హైదరాబాద్​ లో సెప్టెంబర్​ 7న ఏర్పడే చంద్రగ్రహణం సంపూర్ణంగా.. స్పష్టంగా కనపడుతుంది.  సూతకాలం ప్రారంభమయ్యే సమయం దగ్గరపడుతుంది.

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం  గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనపడతాడు.  అందుకే దీనికి బ్లడ్​ మూన్​ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 7 వ తేది  రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం  అర్థరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది.గ్రహణం  మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 28 నిమిషాలు ఉంటుంది.

శాస్త్రాల ప్రకారం.. చంద్రగ్రహణం సూతకాలం  గ్రహణానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది.  అంటే సెప్టెంబర్​ 7 వ తేది మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభమవుతుంది.  అప్పటినుంచి గ్రహణ నియమాలను ఆచరించాలని చెబుతున్నారు.

2022 తరువాత మళ్లీ ఇప్పుడే  సుదీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం భారతదేశంలో  అన్ని ప్రాంతాల్లో కనువిందు చేయనుంది.  మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 డిసెంబర్​ 31 వ తేది  సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూ కక్ష కు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుని కక్ష ఉంటుంది.   సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రునిపై పడి చంద్రగ్రహణం సంభవిస్తుంది. 7 వ తేదీ రాత్రి 9.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదని...  నేరుగా చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.    సంపూర్ణ గ్రహణం సెప్టెంబర్​ 7 వ తేది  రాత్రి 11.01 నుంచి ప్రారంభమవుతుందని.. రాత్రి  12.23 గంటల వరకు 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం 8 వ తేదీ తెల్లవారు జామున 1.26 గంటలకు గ్రహణం వీడిపోతుంది.

 భారత దేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికీ వెళ్లరు. కొందరు గర్భిణులకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని భావిస్తుంటారు