లస్ట్ స్టోరీస్2 టీజర్ రిలీజ్.. రెచ్చిపోయిన తమన్నా, మృణాల్

లస్ట్ స్టోరీస్2 టీజర్ రిలీజ్.. రెచ్చిపోయిన తమన్నా, మృణాల్

"లస్ట్ స్టోరీస్"(Lust Stories).. భారతీయ ఓటీటీలో ఇది ఒక సంచలనం. అడల్ట్ కంటెంట్ కు పెద్దపీట వేస్తూ నెట్ఫ్లిక్స్(Netflix)లో వచ్చిన ఈ సిరీస్ పై.. వివాదాలు, విమర్శలు కూడా వినిపించాయి. ఇక ఈ అడల్ట్ సిరీస్ కు సీక్వెల్ కూడా రానుందనే అనౌన్స్మెంట్ వచ్చింది. జూన్ చివర్లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సిరీస్ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ సిరీస్ లో కూడా బోల్డ్ కంటెంట్ ఉండనుందనే విషయాన్ని టీజర్ తోనే తెలియజేశారు మేకర్స్. "ఓ చిన్న కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా.. మరి పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? అంటూ ఒక బామ్మ చెప్పున డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఈ ఒక్క డైలాగ్ చాలు సిరీస్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి. ఇక ఈ సీక్వెల్ కోసం స్టార్ క్యాస్ట్ వర్క్ చేస్తున్నారు. అందులో కాజోల్(Kajol), తమన్నా(Thamannah), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ఇలా చాలా మంది స్టార్స్ ఈ సిరీస్ లో నటిస్తున్నారు. 

దీంతో ఈ సిరీస్ పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని మాత్రం ఈ సిరీస్ ఏమాత్రం డిజపాయింట్ చేయదట. మరి టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సిరీస్.. మరి రిలీజయ్యాకా ఎలాంటి సంచలనాలు రేపనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.   

https://www.youtube.com/watch?v=4aanxonXWiM