ట్రైలర్ టాక్..

ట్రైలర్ టాక్..

‘కథకు అవసరం కాబట్టే ఇంటిమేట్ సీన్స్‌‌లో నటించాను’ అంటూ ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘జీ కర్దా’ వెబ్‌‌ సిరీస్‌‌ గురించి వివరణ ఇచ్చింది తమన్నా. ఆమె నటించిన మరో వెబ్ సిరీస్‌‌ ‘లస్ట్ స్టోరీస్‌‌ 2’లోనూ ఆమె రొమాంటిక్ సీన్స్‌‌లో నటించింది. ఇది కూడా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. 2018లో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్‌‌’ ప్రాంచైజీలో వస్తున్న రెండో సిరీస్‌‌ ఇది. బుధవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. తమన్నాతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ, విజయ్ వర్మ నటించారు. 

అమిత్ ఆర్ బాల్కి, రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ పార్ట్ తరహాలోనే బోల్డ్ కంటెంట్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌‌తో  ఈ వెబ్ సిరీస్‌‌ ఉండబోతోందని ట్రైలర్‌‌‌‌ను బట్టి అర్థమవుతోంది. నాలుగు ముఖ్యపాత్రలు, వాళ్ల కోరికలు, అందుకోసం వాళ్లు చేసే ప్రయత్నాలే ఇందులో కంటెంట్. రియల్ లైఫ్ లవర్స్ విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. పెళ్లి కాని తమన్నాతో పెళ్లయిన విజయ్ రిలేషన్‌‌లో ఉన్నట్టు చూపించారు. జూన్​ 29 నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌‌లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది.