లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ : టైటిల్ లోనే కామం.. చూస్తే నీరసం, నిద్ర

లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ : టైటిల్ లోనే కామం.. చూస్తే నీరసం, నిద్ర

లస్ట్‌ స్టోరీస్‌ 2.. తమన్నా, విజయ్ వర్మ, కాజోల్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్. 2018లో విడుదలై సూపర్ సక్సెస్ అయిన లస్ట్‌ స్టోరీస్‌ సిరీస్ కు ఇది సీక్వెల్. ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సిరీస్.. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? అనేది ఈ రివ్యూలో చూద్దాం.  

కథ: వేద (మృణాల్‌ ఠాకూర్‌) అర్జున్‌ (అంగద్‌ బేడీ) ఇద్దరు  పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇరు కుటుంబాలు  ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో వేద బామ్మ (నీనా గుప్త).. యువ జంట జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలని, దానివల్ల ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉంటారా? లేదా? అనేది తెలుస్తుందని చెబుతుంది. మరి బామ్మ చెప్పిన మాటలు విని వేద, అర్జున్‌ ఏం చేశారు? చివరికి వీరి పెళ్లి జరిగిందా? అనేది మిగిలిన కథ.

సెగ్మెంట్1 విశ్లేషణ: వేద (మృణాల్ ఠాకూర్), అర్జున్ (అంగద్ బేడీ) ఇద్దరూ పెళ్ళి  చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలో మృణాల్ ఠాకూర్ బామ్మ(నీనా గుప్తా) వాళ్ళను సె*క్స్ లో పాల్గొన్నారా అని అడుగుతుంది. దానికి వారు సిగ్గుపడతారు. కానీ.. ఒక జంట జీవితాంతం కలిసి ఉండటంలో శృంగారం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేది బామ్మ అభిప్రాయం. అంతేకాదు ఆ క్రమంలో బామ్మ వేదకి అమూల్యమైన పాఠాలను నేర్పుతుంది. మరి బామ్మ మాటలు విని వేద ఎం చేసింది? వేద, అర్జున్ పెళ్లి చేసుకున్నారా? తరువాత ఎం జరిగింది అనేది మిగిలిన కథ. 

సెగ్మెంట్2 విశ్లేషణ: తిలోత్తమ షోమ్, అమృత సుభాష్ లకి సంబంధించింది. తిలోత్తమ షోమ్ పని మనిషి ఆమె భర్తతో కలిసి ఉండటాన్ని చూస్తుంది. అది కూడా తన బెడ్ రూలో. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో ఉన్న ఇంటిలో.. తన కోరిక తీర్చుకునేందుకు ప్రైవసీ దొరకడం లేదని పనిమనిషి, తన భర్త ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరోజు యజమాని బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ బెడ్ రూమ్ ని వాడేసుకుంటారు. అది ఆ యజమాని చూస్తుంది. మరి ఆ తరువాత ఏమైంది? అనేది మిగిలిన కథ.

సెగ్మెంట్3 విశ్లేషణ: ఈ ఎపిసోడ్ తమన్నా, విజయ్ వర్మలకు సంబంధించింది. తమన్నా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో శారీరకంగా కలిసేందుకు ప్రయతిస్తు ఉంటుంది. ఈ ఎపిసోఎడ్ చాలా నాశిరకంగా ఉంటుంది. పాత్రలు కూడా సహజంగా ఉండవు. కానీ ఈ జంట వల్లే ఈ సిరీస్ కు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.

సెగ్మెంట్4 విశ్లేషణ: ఇది కాజోల్, కుముద్ మిశ్రాలకు సంబంధించింది. ఇందులో కాజోల్ దేవయాని సింగ్ పాత్రలో నటించగా.. కుముద్ మిశ్రా సూరజ్ సింగ్ గా  కనిపించారు. సూరజ్ కి కోరికలు ఎక్కువ. కనీసం ఇంట్లో పనిమనిషిని కూడా వదలడు. కానీ.. దేవయాని ఆమె తన చుట్టూ జరుగుతున్న విషయాన్ని గ్రహించలేకపోతుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో దేవయాని షాక్ అవుతుంది. మరి ఆ షాకింగ్ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే లస్ట్ స్టోరీస్ 2 చూడాల్సిందే.

నటీనటులు : ఎపిసోడ్ 1లో మృణాల్ ఠాకూర్ బామ్మగా నీనా గుప్తా బాగా నటించారు. మనవరాలికి, మనవడుకి సె*క్స్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పిన విధానం బాగుంటుంది.  ఎపిసోడ్ 4లో దేవయాని పాత్రలో కాజోల్ బాగా నటించింది. తన సహజ నటనతో అందరినీ ఆకర్షిచింది. ఇక మిగిలిన రెండు ఎపిసోడ్స్ లో పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి  ఏమీలేదు. తమన్నా మాత్రం బోల్డ్ సీన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసింది. ఇక విజయ్ వర్మ కూడా పరవాలేదనిపించారు.   

సాంకేతిక వర్గం: ఈ సిరీస్ కు ప్రధాన బలం వర్క్. చాలా అద్భుతంగా ఉన్నాయి సిరీస్ లో సీన్స్. ఇక నిర్మాణ విలువలు యావరేజ్ గా నిలిచాయి. కంటెంట్ లో కొత్తేమి లేదు జస్ట్ లస్ట్ స్టోరీస్ బ్రాండ్ ని వాడుకుని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు ,మేకర్స్.

ఇక మొత్తంగా: లస్ట్ స్టోరీస్ 2..  నీరసంగా సాగిన కామం కథ