నా ఆస్తులు 14 వందల కోట్లు.. గోవా, లండన్ లో ఇల్లు ఉన్నాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి

నా ఆస్తులు 14 వందల కోట్లు.. గోవా, లండన్ లో ఇల్లు ఉన్నాయి : బీజేపీ ఎంపీ అభ్యర్థి

నువ్వు గ్రేట్ బాస్.. భారత్ మాతా కీ అంటావ్.. జై భారత్ అంటావ్.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతావ్.. భారతదేశం నా పుణ్య భూమి అంటావ్.. తీరా ఆస్తులు మాత్రం విదేశాల్లో.. ఆ ఆస్తులు కూడా దుబాయ్ లో.. అది ముస్లిం దేశం అని నువ్వు అంటావ్.. అదే దేశంలో కోట్లకు కోట్లు పెట్టి అపార్ట్ మెంట్లు కొంటావ్.. ఇదీ గోవా బీజేపీ ఎంపీ అభ్యర్థి వైఖరి అంటున్నారు కాంగ్రెస్ నేతలు..

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ దక్షిణ గోవా అభ్యర్థి డెంపో ఏప్రిల్ 16న నామినేషన్  దాఖలు చేశారు. 119 పేజీల అఫిడవిట్ ను ఎన్నికల అధికారికి అందిజేశారు. ఇందులో  తన భర్త శ్రీనివాస్ తో పాటు ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1400 కోట్లుగా ఉండడం గమనార్హం. పల్లవి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన డెంపో గ్రూప్ఛైర్మన్ శ్రీనివాస్  డెంపోను పెళ్లి చేసుకుంది. 

పల్లవి అఫిడవిట్‌లో రూ. 255.4 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.  శ్రీనివాస్‌కు చెందిన ఆస్తుల విలువ రూ.994.8 కోట్లు. పల్లవి స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.28.2 కోట్లు కాగా శ్రీనివాస్ ఆస్తుల మార్కెట్ విలువ రూ.83.2 కోట్లు.


విశేషమేమిటంటే.. గోవా , దేశంలోని ఇతర ప్రాంతాలలో వారికి చెందిన ఆస్తులే కాకుండా..  సవన్నా దుబాయ్‌లో డెంపో దంపతులకు  అపార్ట్‌మెంట్‌ ఉంది.   దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 2.5 కోట్లు.  అలాగే లండన్‌లోని అపార్ట్‌మెంట్ విలువ  అఫిడవిట్ ప్రకారం రూ.10 కోట్లు.  పల్లవికి బంగారంపై ఉన్న మక్కువ కూడా ఆమె అఫిడవిట్‌లో తెలిపారు.  ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ. 5.7 కోట్లుగా పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పల్లవి రూ. 10 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయగా..  శ్రీనివాస్ అదే ఏడాది రూ. 11 కోట్ల రిటర్నులు దాఖలు చేశారు.