హైదరాబాద్ లో లగ్జరీ ఫ్లాట్లే అమ్ముడవుతున్నయ్.. ​

హైదరాబాద్ లో లగ్జరీ ఫ్లాట్లే అమ్ముడవుతున్నయ్.. ​
  • సీబీఆర్​ఈ రిపోర్టు వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన సిటీలలోనూ లగ్జరీ ఫ్లాట్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఒక రిపోర్టు వెల్లడించింది. జనవరి–మార్చి 2023  మధ్య కాలంలో  రూ. కోటి అంతకు మించి విలువైన లగ్జరీ ఫ్లాట్ల సేల్స్​ ఏకంగా రెండున్నర రెట్లు పెరిగినట్లు సీబీఆర్​ఈ రీసెర్చ్​ రిపోర్టు పేర్కొంది. ఆ కాలంలో మొత్తం 4 వేల లగ్జరీ ఫ్లాట్లు విక్రయమైనట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో చూస్తే లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు 1,600 యూనిట్లు  మాత్రమేనని వివరించింది. ఢిల్లీ–ఎన్​సీఆర్​ రీజియన్​లో లగ్జరీ ఫ్లాట్ల సేల్స్​ మూడు రెట్లు పెరిగి 1,900 యూనిట్లకు చేరాయని సీబీఆర్​ఈ తెలిపింది. ముంబైలో 1,150 యూనిట్లకు, పుణెలో 150 యూనిట్లకు, బెంగళూరులో 50 యూనిట్లకు, కోల్​కత్తాలో 100 యూనిట్లకు లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు పెరిగాయి.

ఇక హైదరాబాద్​లోనైతే రూ. 4 కోట్ల పైన విలువుండే లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు ఏకంగా 8 రెట్లు పెరిగాయి. అంతకు ముందు ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో కేవలం 50 యూనిట్లుగా ఉన్న లగ్జరీ ఫ్లాట్ల సేల్స్​ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో 450 యూనిట్లకు చేరుకున్నాయని సీబీఆర్​ఈ రీసెర్చ్​ రిపోర్టు పేర్కొంది. కరోనా తర్వాత లగ్జరీ ఫ్లాట్లపై జనంలో ఇష్టం ఎక్కువైందని, దీంతో ఈ సెగ్మెంట్​ జోరందుకుందని వివరించింది.