సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళ్ళింది.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి

సోషల్ మీడియా కుక్కల చేతిలోకి వెళ్ళింది.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి

సోషల్ మీడియా వచ్చాకా ఎవరుపడితే వాళ్ళు తమ అభిప్రయాన్ని ఓపెన్ గా చెప్తున్నారు. ఆడియన్స్ తమకు నచ్చిన విషయాలపై ఎలా రియాక్ట్ అవుతున్నారో.. నచ్చనివాటిపై కూడా అంతకన్నా ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ కు ఒక లిమిట్ ఉంటే బాగుంటుంది కానీ.. ఈ మధ్య చాలా దారుణంగా ట్రోల్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మరీ బూతులు తిడుతూ రెచ్చిపోతున్నారు. అలా చేయడం కరక్ట్ కాదు. 

సరిగ్గా ఇలాంటిదే మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం విషయంలో జరిగింది. ఇటీవలే ఈ సినిమా నుండి రెండో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ మై బేబీ అంటూ సాగే ఈ పాటకు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. కొంతమంది మాత్రం పాట అస్సలు బాగోలేదంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను, రచయిత రామజోగయ్య శాస్త్రిపై కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. 

ఆ కామెంట్స్ హద్దులు దాటుతుండటంతో.. గేయరచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.. ప్రస్తుతం సోషల్‌ మీడియా కుక్కల చేతిలోకి వెళుతోంది. విషయం గురించి తెలియని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలని విషాన్ని చిమ్ముతున్నారు. కావాలని టార్గెట్‌ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరో ఒకరు మాట్లాడాలి. వీళ్లు లిమిట్స్ దాటుతున్నారు.. అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఆతరువాత కాసేపటికి మరో పోస్ట్ పెట్టారు. అందులో.. ప్రతివాడు మాట్లాడేవాడే.. రాయి విసిరేవాడే.. అభిప్రాయం చెప్పడం తప్పుకాదు కానీ.. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. నిడివి తప్పా.. నిన్న రిలీజైన పాటకు ఏం తక్కువైంది? సినిమాపై మీ కన్నా ఎక్కువ ప్రేమే మాకు. ఆ ప్రేమే లేకపోతే మా పనిని గొప్పగా చేయలేం. అది తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడండి. హద్దులు మీరకండి.. అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి చేసిన ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.