సీఐఈ ఆటోమోటివ్‌‌‌‌‌‌‌‌లో మహీంద్రా వాటా అమ్మకం

సీఐఈ ఆటోమోటివ్‌‌‌‌‌‌‌‌లో మహీంద్రా వాటా అమ్మకం

న్యూఢిల్లీ: సీఐఈ ఆటోమోటివ్ ఎస్‌‌‌‌‌‌‌‌ఏలో 3.58 శాతం వాటాను  తమ సబ్సిడరీ కంపెనీ మహీంద్రా ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ (మారిషస్‌‌‌‌) లిమిటెడ్ (ఎంఓఏసీఎంఎల్‌‌‌‌‌‌‌‌)  అమ్మిందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. ఈ డీల్ విలువ119 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,240 కోట్లు) .  

మహీంద్రా షేర్లు గురువారం  0.6 శాతం పెరిగి రూ.3,672 వద్ద ముగిశాయి. సీఐఏ ఆటోమోటివ్ ఎస్‌‌‌‌‌‌‌‌ఏ హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  స్పెయిన్‌‌‌‌‌‌‌‌లో  ఉంది. ఈ కంపెనీ వెహికల్ పార్టులను తయారు చేస్తోంది. తాజా షేర్ల విక్రయం తర్వాత కూడా ఎంఓఏసీఎంఎల్‌‌‌‌‌‌‌‌కు  అసోసియేట్ కంపెనీగా ఇది కొనసాగుతుంది.