మా ఊరి పొలిమేర2 : ఓటీటీలో రికార్డు వ్యూస్

మా ఊరి పొలిమేర2 : ఓటీటీలో రికార్డు వ్యూస్

సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కరాల, గెటప్‌ శ్రీను కీలక ప్రాతల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర2.  నవంబర్ 03న థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. బ్లాక్‍ మ్యాజిక్, సస్పెన్స్, ట్విస్టులతో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అనిల్ విశ్వనాధ్  దర్శకత్వం వహించారు.  

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అదరగొడుతుంది.  డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం..  నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును దాటేసింది. ఈ విషయాన్ని  ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది.  

కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి, జాస్తిపల్లి పొలిమేరలోని గుడికి లింక్ పెడుతూ దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీని నడిపించాడు.  ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉందని అనౌన్స్ చేసి సినిమాపై మరింత అంచనాలను పెంచేశాడు.  ఈ చిత్రానికి  గ్యానీ సంగీతం అందించగా.., శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు.