
నటుడు సత్యం రాజేష్(Sathyam Rajesh) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర2(Maa Oori Polimera2). చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2021లో వచ్చిన మా ఊరి పొలిమేర కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్, అదిరిపోయే ట్విస్టులతో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ వెన్నులో వణుకుపుట్టించింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది.
Pooja konchem early ga start cheddam!?
— ahavideoin (@ahavideoIN) December 6, 2023
ఆవాహాయామి...ఆవాహయామీ!!☠️☠️#Polimera2 Streaming Now for #ahaGold Subscribers.
▶️https://t.co/EjVZhew7vD@Satyamrajesh2 #kamakshiBhaskarla @DrAnilviswanath @Connect2vamsi @Gowrkriesna @getupsrinu3 pic.twitter.com/12GJ0woPj2
ఇక థియేటర్ లో అంచనాలకు మించి రాణించిన మా ఊరి పొలిమేర 2 సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రాముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో నేటి నుంచి(డిసెంబర్ 7) స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే డిసెంబర్ 7న కేవలం ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కి మాత్రమే అందుబాటులో ఉండనుండగా.. డిసెంబర్ 8 నుండి అందరికి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.