-
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్
బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అక్టోబర్ 25 నుంచి మాలల మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర భద్రాచలం నుంచి ప్రారంభమై 43 నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. వెయ్యి కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని...మాలలను , మాల ఉపకులలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. మాలల పై మందకృష్ణ మాదిగ విషం చిమ్ముతున్నారని అన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముగింపు సభ ఉంటుందని తెలిపారు.