పార్కింగ్ బైక్ లే టార్గెట్.. దొంగ అరెస్ట్

పార్కింగ్ బైక్ లే టార్గెట్..  దొంగ అరెస్ట్
  • 20 బైక్ లను స్వాధీనం చేసుకున్న మాదాపూర్ పోలీసులు

మాదాపూర్​, వెలుగు : పార్కింగ్ బైక్ లను టార్గెట్ గా చేసుకుని ఎత్తుకెళ్తున్న దొంగను మాదాపూర్​పోలీసులు అరెస్ట్​ చేశారు. అతని వద్ద 20 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మాదాపూర్​పోలీసులు తెలిపిన ప్రకారం.. మహబూబ్​నగర్​కు చెందిన సత్యారం కృష్ణ(35)  లంగర్​హౌస్​లో ఉంటూ క్యాబ్​ డ్రైవర్​గా చేస్తున్నాడు. జల్సాలు చేసేందుకు కృష్ణ  బైక్ లను ఎత్తుకెళ్లి అమ్ముతున్నాడు. 

కాలేజీలు, వైన్స్, షాపింగ్​మాల్స్​, హాస్పిటల్స్​వద్ద హ్యాండిల్​లాక్​వేయని బైక్ ల ప్లగ్​వైర్లతో స్టార్ట్​చేసి ఎత్తుకెళ్తున్నాడు. మహబూబ్​నగర్​కు చెందిన గొల్ల నరేష్​(29), మెకానిక్ షకీల్​అహ్మద్​(32)కు అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. రెండేండ్లలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 20 బైక్ లను దొంగిలించాడు. నిఘా పెట్టిన మాదాపూర్ పోలీసులు శుక్రవారం నిందితుడు కృష్ణను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో నరేష్, షకీల్,​ నారాయణపేట్​కు చెందిన నర్సింహ పరారీ ఉన్నారని పోలీసులు తెలిపారు.