పైన రాగి కంకులు... కింద గంజాయి

పైన రాగి కంకులు... కింద  గంజాయి

యూపీలోని మధురకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన సౌరవ్ సింగ్, జై ప్రకాష్ సింగ్, రాధా ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. రాగి కంకుల మాటున గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 23.524 కేజీల గంజాయి, ఒక కారు, మూడు సెల్ ఫోన్ లు,  రూ. 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

హైటెక్ సిటి రైల్వే స్టేషన్ నుండి కొండాపూర్ RTA ఆఫీసు దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సౌరవ్ సింగ్, జై ప్రకాష్ సింగ్, రాధా DL 3C BE 3085 నెంబర్ గల కారులో రహస్య బాక్స్ లో గంజాయిని ఉంచి..పై నుంచి రాగి కంకుల ప్యాకెట్లు ఉంచారని  చెప్పారు. ఒడిశాలోని  డార్లి ఫుట్ ప్రాంతం నుండి అరకు- విజయవాడ- నుంచి హైదరాబాద్ మీదుగా- యూపీలోని మధురకు గంజాయిని తీసుకెళ్తున్నారని వెల్లడించారు. అరకు, ఒడిశాలకు చెందిన రమేశ్, తుంనాథ్ అనే  వ్యక్తుల నుంచి గంజాయిని రెండు వేలకు గంజాయిని కొనుగోలు చేసి యూపీలో రూ. 15 వేలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.  నిందితులపై కేసు నమోదు చేసి ..రిమాండ్ కు తరలించామన్నారు.