కేబుల్ బ్రిడ్జిపైయువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మాదాపూర్ పోలీసులు 

కేబుల్ బ్రిడ్జిపైయువకుడి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మాదాపూర్ పోలీసులు 

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని రక్షించారు మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ పర్వతనగర్ లో నివాసం ఉంటున్న క్యాబ్ డ్రైవర్ సాయి కిరణ్ ( 23) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన మాదాపూర్ పోలీసులు గమనించి సాయికిరణ్ ను కాపాడారు.

ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశావని సాయికిరణ్ ను పోలీసులు విచారించగా..క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నా.. సరియైన సంపాదన లేక దిక్కుతోచని స్థితిలో తాను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యచేసుకుందామని నిర్ణయించుకున్నానని  చెప్పాడు.  సాయికిరణ్ కు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.