నేటి నుంచి మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు

అమ్రాబాద్, వెలుగు :  నల్లమలలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం నిత్యార్చన, విఘ్నేశ్వరపూజ, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, ఊష్ణవాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రంగాచారి తెలిపారు.

శనివారం వాస్తుపూజ, రుద్రహోమం, సహస్ర నామార్చన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, సాయంత్రం మనుసూక్త హోమం, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి అశ్వవాహన సేవ చేపట్టనున్నారు. ఆదివారం విఘ్నేశ్వర, గవ్యాంతర పూజలు, రుద్రహోమం, నిత్యోపాసన బలిహరణ, మహానివేదిక నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, హన్మత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్రతం, రాత్రికి శివపార్వతుల కల్యాణం, మహామంగళహారతి, గజ వాహన సేవ ఉంటుంది. సోమవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, గవ్యాంతరం పూజ, రుద్రహోమం, బలిహరణ, నిత్యోపాసనం, మహానివేదన నీరాజనమంత్రపు ష్పం, తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి  సీతారాముల కల్యాణం, గరుడ వాహన సేవ, మంగళవారం ఉదయం కృష్ణా జలాలతో 108 కలశాలతో మహాకుంభాభిషేకం, హన్మత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎంపీ రాములు, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని ఈవో తెలిపారు.