సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ ఇటీవల మెసేజ్ చేసిన వ్యక్తి మరోసారి మెసేజ్ చేశాడు. సల్మాన్ ఖాన్ ను బెదిరించి తప్పుచేశా..తనను క్షమించండని అదే నంబర్ నుంచి మళ్లీ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ చేశాడు. అయితే ఈ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించినట్లు చెప్పారు.
ALSO READ | Staystrong: నా నిజమైన దేవత మా అమ్మ.. స్టార్ హీరో ఎమోషనల్ పోస్ట్
మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య తర్వాత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని తేల్చిచెప్పిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే.. 2024 అక్టోబర్ 18వ తేదీన.. ముంబై పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను చంపేస్తాం.. చంపకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ముంబై ట్రాఫిక్ పోలీసులకు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వాట్సప్ లో మెసేజ్ చేశారు. ముంబై పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ కంటే దారుణంగా సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించారు. లేటెస్ట్ గా అదే నంబర్ నుంచి అక్టోబర్ 21న ముంబై ట్రాఫిక్ పోలీసులకు మళ్లీ మెసేజ్ రావడం విశేషం.