ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం అక్టోబర్ 20న ఉదయం తుదిశ్వాస విడిచారు.
తాజాగా తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకుంటూ కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. " మానవ రూపంలో నా పక్కనే ఉన్న నా నిజమైన దేవత మా అమ్మ. ఎందుకంటే ఆమె నా పండుగ.. నా గురువు.. నా నిజమైన శ్రేయోభిలాషి మరియు నా మొదటి అభిమాని అని తలుచుకున్నారు. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే. 24 గంటల్లో అంతా మారిపోయింది. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి నా దగ్గర పదాలు లేవు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేకపోతున్నాను.. ఇకపై నాకు ‘గుడ్ మార్నింగ్ కన్నా’ అనే మెసేజ్ రాదు అని వాపోయారు.
ALSO READ | రెడీగా ఉండండి: 25న వీళ్ల లగ్గం.. మీ అందరూ వస్తున్నారా
అలాగే శుక్రవారం (అక్టోబర్ 18న) చివరిసారి మెసేజ్ పెట్టింది. మరుసటి రోజు శనివారం బిగ్‌బాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు అమ్మ ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లాను. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా అంటే తాను చేసే పనిలో (నటనలో) ఎలా ఉండాలో నేర్పించినందుకు మా అమ్మకు రుణపడి ఉంటాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది నాకొ సూత్రం అని సుదీప్ పోస్ట్ లో చెప్పారు.
అంతేకాకుండా శనివారం బిగ్‌బాస్‌షూటింగ్ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి అప్పటికే అమ్మను వెంటిలేటర్‌పై ఉంచారని.. స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయానని.. ఆదివారం (అక్టోబర్ 20) ఉదయం ఆమె శాశ్వతంగా దూరమైందని.. తనదైన పదాలతో కిచ్చా సుదీప్ తన బాధను వ్యక్తం చేశారు".
ప్రస్తుతం సుదీప్ చేసిన పోస్ట్ తన అభిమానులని, సినీ ప్రముఖులని కలిచివేస్తోంది. దీంతో 'స్టేస్ట్రాంగ్ అన్న'#Staystrong అంటూ కిచ్చా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ధైర్యం చెప్తున్నారు.
My mother , the most unbiased, loving, forgiving, caring, and giving, in my life was valued , celebrated, and will always be cherished.
— Kichcha Sudeepa (@KicchaSudeep) October 21, 2024
*Valued... because she was my true god next to me in the form of a human.
*Celeberated... because she was my festival. My teacher. My true… pic.twitter.com/UTU9mEq944