అందుబాటులోకి మేడిన్‌‌ ఇండియా కవాసకి కేఎల్‌‌ఎక్స్‌‌

అందుబాటులోకి మేడిన్‌‌ ఇండియా కవాసకి కేఎల్‌‌ఎక్స్‌‌

కవాసకి భారత్‌‌లో తయారైన 2026 కేఎల్‌‌ఎక్స్‌‌230ఆర్‌‌‌‌ఎస్‌‌  బైక్‌‌ను రూ.1.94 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది. ఆఫ్-రోడ్ బైక్‌‌లంటే ఇష్టపడే వారి కోసం దీనిని తీసుకొచ్చింది. 2025 కేఎల్‌‌ఎక్స్‌‌ 230 ఆర్‌‌‌‌ఎస్‌‌(సీకేడీ) కూడా అమ్మకంలో ఉంటుంది. సీకేడీ వెర్షన్‌‌లో అల్యూమినియం ఫ్రేమ్  ఉండగా, భారత మోడల్‌‌ను  స్టీల్‌‌తో తయారు చేశారు. 95శాతం  విడిభాగాలను లోకల్‌‌గా సేకరించామని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌‌ బరువు 129కేజీలు. ఇందులో  233సీసీ ఇంజన్ అమర్చారు. ఇది  19.57బీహెచ్‌‌పీ పవర్‌‌‌‌, 20.6ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  6-స్పీడ్ గేర్‌‌బాక్స్, 270ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 900ఎంఎం  సీటు ఎత్తు వంటివి ఇందులో ఉన్నాయి.