పేస్ట్ గా చేసి.. క్యాప్సల్స్ గా మార్చి.. రూ.1.30 లక్షల బంగారం అక్రమ రవాణా

పేస్ట్ గా చేసి.. క్యాప్సల్స్ గా మార్చి.. రూ.1.30 లక్షల బంగారం అక్రమ రవాణా

బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇవి... రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో చెకింగ్ చేస్తున్నప్పుడు ఒకరి వైఖరి అనుమానాస్పదంగా ఉండటం అధికారులు గమనించారు. అతడిని చెక్ చేయగా రూ.కోటి 30 లక్షల విలువైన బంగారం దొరికింది. 

క్యాప్సూల్స్ రూపంలో బంగారం..

నిందితుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి 6 క్యాప్సూల్స్ రూపంలో తీసుకెళ్తున్నాడు. విమానాశ్రయంలోని డొమెస్టిక్ డిపార్చర్ ఏరియాను వేరు చేసే గోడ, గ్యాస్ ప్యానెల్ కి మధ్య ఉన్న చిన్న గ్యాప్ ద్వారా బంగారం నిందితుడికి చేరవేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. ఇటీవల ముంబయి లోని నాగ్ పుర్ విమానాశ్రయంలో 3.35 కిలోల బంగారం పట్టుబడింది.