
మాదాపూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహీల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే సాయిధరమ్ తేజ్ రోడ్డుప్రమాదంపై మాదాపూర్ ఏసీపీ స్పందించారు. ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకున్నాడని..మద్యం సేవించలేదన్నారు. వేగంగా ఉండటం రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యిందని..అందుకే కంట్రోల్ చేయలేకపోయాడన్నారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఐపీసీ 336,184 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.