
తేజ్, రిషిక లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్రరావు దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. గురువారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు విష్ణు మాట్లాడుతూ ‘మేకప్‌మెన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన చంద్ర గారు.. ఇప్పుడు డైరెక్టర్‌గా, నిర్మాతగా సినిమా చేయటం సామాన్యమైన విషయం కాదు.
ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది’అన్నాడు. ఇదొక చక్కని ప్రేమకథా చిత్రమని చెప్పారు రామచంద్రరావు. ‘నాన్న రామచంద్రరావు నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా’ అన్నాడు తేజ్. నిర్మాత కె.దామోదర్ ప్రసాద్, డైరెక్టర్స్ సముద్ర, వై.వి.ఎస్.చౌదరి పాల్గొని చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేశారు.