మూసీ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సర్వేపై మూసీ పరివాహక ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది..ఈ క్రమంలో చైతన్యపురిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్. బాధితులతో మాట్లాడిన మధు యాష్కీ కూల్చివేతలపై ఎటువంటి ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇండ్లను ఇచ్చే ప్రభు త్వమని..ఎవరి ఇండ్లు కూలగొట్టదన్నారు. అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని, అక్రమాలకు పాల్పడ్డ అధికారులు, కబ్జా రాయుళ్లు, బిల్డర్లపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు మధు యాష్కీ.
ALSO READ | హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిది..పేదోడి జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కూనంనేని
మూసీలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా మంచినీటిని ప్రవహింప చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అన్యాయంగా ప్రజల ఇండ్లు కూల గొడితే..అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందన్నారు మధు యాష్కీ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థం కోసం మూసీసుందరీకరణ చేపట్టడం లేదన్నారు. మూసీలో ప్రవహించే మురు గునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ఐదు టీఎంసీల గోదావరి నీటిని ప్రవహింపజేసి..మురుగు కంపు తొలగించి, మంచినీటిని ప్రవహింప చేయాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉందన్నారు మధు యాష్కీ.
నోటీసులు ఇవ్వకుండా, ప్రజల అంగీకారం లేకుండా ఏ ఇల్లు కూలదన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇళ్ళు కూల్చాలి అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు నాలుగింతల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. మూసికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ కూడా చేయవచ్చు అని పేర్కొన్నారు. నదికి ఇళ్లు ఉన్న వైపు కాకుండా.. పొలాలు ఉన్న వైపు ఎక్కువ స్థలాన్ని సేకరించి సుందరికరణ చేయవచ్చు అని సూచించారు.