రాజకీయాల్లోకి మాజీ టాప్ హీరోయిన్.. లోక్ సభకు పోటీ

రాజకీయాల్లోకి మాజీ టాప్ హీరోయిన్.. లోక్ సభకు పోటీ

రాజకీయాల్లోకి హీరోయిన్స్ రావటం కామన్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగటానికి మరో హీరోయిన్ రెడీ అయ్యారు. ఆమే మాధురీ దీక్షిత్. 90లో హిందీ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె.. కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నారంట. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సీటు కూడా కన్ఫామ్ చేసుకున్నారంట. ఈ మేరకు జాతీయ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

ఇంతకీ మాధురీ దీక్షిత్ పోటీ చేసే సీటు ఏదీ అంటారా.. మహారాష్ట్ర రాష్ట్రం ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఆమె బీజేపీ నేతలతో కలిసి కనిపించటం వెనక కారణాలు ఇవే అంటున్నారు రాజకీయ నేతలు. మొన్నటికి మొన్న ముంబైలో జరిగిన ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు బీజేపీ నేత ఆశిష్ షెల్లార్ తో కలిసి రావటం తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తో కలిసి కనిపించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే బీజేపీ సీటు గ్యారంటీ అని.. పోటీ చేయటం ష్యూర్ అని అక్కడి రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఎప్పుడూ సినిమా విషయాలను మాత్రమే తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే మాధురీ దీక్షిత్.. ఇటీవల క్రికెట్ గురించి.. ప్రభుత్వం గురించి తన అభిప్రాయాలను వెల్లడించటం చూస్తుంటే.. పొలిటికల్ ఎంట్రీ గ్యారెంటీ అంటున్నారు లీడర్స్. చూడాలి.. రాబోయే రోజుల్లో మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అని..