ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదు

ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదు

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులను పక్కన పెట్టుకుని కేసీఆర్ ప్లీనరీ నిర్వహించారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని..వారిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారని ..దేశ రాజకీయాల్లోకి వెళ్తారని నిలదీశారు. ఎప్పుడైనా విద్య,వైద్యంపై కేసీఆర్ సమీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు బీజేపీ తో అంటకాగిన కేసీఆర్ ఇప్పుడు సడెన్ గా యూటర్న్ తీసుకుని విమర్శిస్తే ప్రజలు నమ్మరని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీఆర్ఎస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 30 సీట్ల కంటే ఎక్కువ రావని..కేసీఆర్కు రిపోర్ట్ ఉందని..అందుకే టీఆర్ఎస్ బీజేపీని హైప్ చేస్తుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి ఎక్కడ?

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాదే