కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ లో చేరిన వాళ్లంతా.. వాళ్ల అక్రమాస్తులను కాపాడుకునేందుకే పార్టీలోకి వస్తున్నారని మాజీ ఎంపీ మధుయాష్కి ఆరోపించారు.   ఎన్ని ఆఫర్లు వచ్చినా తాము కాంగ్రెస్ ను వీడలేదన్నారు. జీవన్ రెడ్డి తన జీవితకాలమంతా కాంగ్రెస్ కష్టకాలంలో సేవచేశారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే డిస్ క్వాలిఫై చేసే అవకాశం ఇప్పటి చట్టంలో లేదన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిరాయింపుల చట్టాన్ని సవరిస్తామని చెప్పారు. 

గంగారెడ్డి ప్రాణానికి ముప్పు ఉందని బంధువులు ఫిర్యాదు చేసినా పోలీసులు భద్రత కల్పించకపోవడం నిర్లక్ష్యమన్నారు మధుయాష్కి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ నాయకుడు హత్య కావడం తనకు బాధేస్తోందన్నారు. దీనిపై లోతుగా విచారణ జరపకుండా పాతకక్షలని చెప్పి మభ్యపెడుతున్నారని అన్నారు. దీనిపై డీజీపీని, సీఎంను కలిసి మాట్లాడుతామని చెప్పారు. 

Also Read : పాలమూరు ల్యాండ్ స్కాంలో.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్

ఫిరాయింపులతో తాము  ఆత్మస్థైర్యం కోల్పోయామని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.   ముందుగానే  పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించి ఉంటే గంగారెడ్డి హత్య జరిగి ఉండేది కాదని చెప్పారు. తమ మిత్రుడిని  సోదరుడిని కోల్పోయానన్నారు జీవన్ రెడ్డి. చంపుతామని నిందితుడు ఫోన్ చేసి బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు జీవన్ రెడ్డి.