కేసీఆర్​ అవినీతికి పాల్పడితే .. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు

కేసీఆర్​ అవినీతికి పాల్పడితే .. చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ అవినీతిపరుడ ని కామెంట్​ చేసిన ప్రధాని మోదీ.. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ గౌడ్​ప్రశ్నించారు. అధికారంలో ఉండి.. అవినీతి జరుగుతున్నదని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఐపీసీ ప్రకారం నేరమే అవుతుందన్నారు. తెలిసీ చర్యలు తీసుకోకుంటే ప్రధాని మోదీ కూడా శిక్షార్హులే అవుతారన్నారు.  శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్​ కుటుంబం అవినీతి ఢిల్లీ దాకా పాకిందంటూ ప్రధాని అదే పాత చింతకాయ పచ్చడి మాటలే చెప్పారని ఎద్దేవా చేశారు. కేసీఆర్​, మోదీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ‘కేసీఆర్​ జూటా.. మోదీ జూటా.. దోనో మిల్కర్​ రాష్ట్ర్, దేశ్​ కో లూటా’ అంటూ కామెంట్​ చేశారు.