ఆర్టీసీ ఆస్తులపై కుట్ర.. మెఘా కంపెనీ వెనక ఓ మంత్రి.?

ఆర్టీసీ ఆస్తులపై కుట్ర.. మెఘా కంపెనీ వెనక ఓ మంత్రి.?

కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు ఏఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ. రాష్ట్ర ఆకాంక్షను ఆసరాగా చేసుకోని కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అమలుకు సాధ్యం కానీ  హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మిన్నకుండటం సరికాదన్నారు. గవర్నర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఆర్టీసీ అప్పులు అనేది ఉత్తదేనని..మెఘా కంపెనీకి ఆర్టీసీ ఆస్తులు కట్టబెట్టడం ఓ కుట్ర అని అన్నారు. దీని వెనక ఓ మంత్రి  ఉండి నడిపిస్తున్నాని ఆరోపించారు. రేపటి బంద్ కు అన్ని పక్షాలు మద్దతు తెలిపి ,బంద్ ని విజయవంతం చేయాలని కోరారు. హుజూర్ నగర్ లో పోటీ లేదని తామే గెలుస్తామన్నారు. ఓటమి భయంతోనే కేటీఆర్ రోడ్ షో లు ,కేసీఆర్ సభ రద్దు చేసుకున్నారని అన్నారు మధు యాష్కి.

.