
మధ్యప్రదేశ్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భోపాల్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. పిల్లలకు స్వీట్లు పంచారు. మొక్కలు నాటారు. పిల్లలతో కలిసి పాటలు పాడారు. డ్యాన్స్ చేసి వారిని ఆనందపరిచారు. శివరాజ్ సింగ్ భార్య కూడా పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశారు. ముఖ్యమంత్రి తమతో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పిల్లలు.
దీపావళి సందర్భంగా యూపీ అయోధ్యలోని సరయూ నది తీరం దీపోత్సవానికి రెడీ అవుతోంది. వాలంటీర్లు లక్షలాది దీపాలను సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం దీపోత్సవాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించనున్నారు. దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు.