
తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. తమకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయని 10మంది ఎమ్మెల్యేలు తనకు చెప్పారని కమల్ వెల్లడించారు. తమ ఎమ్మెల్యేలకు డబ్బు, పదవులను బీజేపీ నేతలు ఆఫర్ చేశారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు కమల్ నాథ్.