రూ.450కే సిలిండర్.. శ్రావణమాసం ఆఫర్

 రూ.450కే సిలిండర్.. శ్రావణమాసం ఆఫర్

భోపాల్ : మధ్యప్రదేశ్​ప్రభుత్వం మద్యతరగతి ప్రజలకు శ్రావణమాసం ఆఫర్​ను ప్రకటించింది. జూలై 4 నుంచి ఆగస్టు 31 వరకు గ్యాస్​సిలిండర్​తీసుకున్నవారి నుంచి రూ.450 మాత్రమే వసూలు చేయనుంది. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని రీయింబర్స్ చేయనుంది. మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​సింగ్​చౌహాన్​ అధ్యక్షతన భోపాల్​లో గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్​లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రి మండలి సమావేశంలో ఎంపీ సర్కార్​పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మీటింగ్​అనంతరం ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్​మిశ్రా మీడియాతో మాట్లాడారు. శ్రావణమాసం సందర్భంగా వంట గ్యాస్​సిలిండర్ ధర రూ.450గా మంత్రిమండలి నిర్ణయించిందని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు రాయితీ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్​చేయనున్నామని, మిగిలిన మొత్తాన్ని అప్లికేషన్​సమర్పించిన అనంతరం అందజేస్తామని వెల్లడించారు. ఆగస్టు 31 వరకు పెంచిన విద్యుత్​బిల్లులను వాయిదావేసినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని రూ.2వేల నుంచి రూ.6వేలకు పెంచామన్నారు.