రూ. 450కే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌.. కేబినేట్ ఆమోదం

రూ. 450కే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌.. కేబినేట్ ఆమోదం

మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   2023 ఆగస్టు 31 గురువారం  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన  మంత్రివర్గ సమావేశంలో రూ. 450కే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ అందించడానికి మంత్రి మండలి ఆమోదించింది.  ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మంత్రి తెలిపారు. 

2023 జూలై 4 నుండి ఆగస్టు 31 మధ్యకాలంలో తమ సిలిండర్‌ను రీఫిల్ చేసిన వారికి మొత్తం తిరిగి చెల్లిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.  ఆశా వర్కర్ల ప్రోత్సాహక మొత్తాన్ని రూ. 2,000 నుండి రూ. 6,000కి పెంచడానికి కేబినేట్ అంగీకరించింది. అయితే ప్రతి సంవత్సరం రూ. 1000 పెంచాలని నిర్ణయం తీసుకుంది.   అలాగే మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్ల సుందరీకరణకు రూ. 1200 కోట్లు మంజూరు చేశారు.

కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.   డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గించింది. ఒక్కో సిలిండర్​పై రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103 ఉంది. ఇకపై ఇది రూ.903కి లభిస్తుంది.ఉజ్వల పథకం లబ్ధిదారులకైతే రూ.703కే లభిస్తుంది. ఇది రాఖీ, ఓనం పండగల సందర్భంగా మహిళలకు ప్రధాని ఇస్తున్న గిఫ్ట్ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.