మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా

మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. వాటర్ రీసోర్స్‌ మినిస్టర్ తులసీ సిలావత్‌తోపాటు ఓబీసీ వెల్ఫేర్ మినిస్టర్ రాంఖిలావన్ పటేల్‌ వైరస్ పాజిటివ్‌గా తేలారు. తనకు కరోనా లక్షణాలు లేవని సిలావత్ అన్నారు. అయితే తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ సూచించడంతో టెస్టులు చేయించుకున్నట్లు సిలావత్ చెప్పారు. సీఎం శివ్‌రాజ్ సింగ్ తర్వాత ఈ నెల 23న కోఆపరేటివ్ మినిస్టర్ అరవింద్ భదౌరియా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన భోపాల్‌లోని చిరాయు మెడికల్ కాలేజీలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.