వాచ్​మన్​ పై మేడిపల్లి ఎస్సై దాడి

వాచ్​మన్​ పై మేడిపల్లి ఎస్సై దాడి

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ సర్వే నం. 85లోని పీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్​యాదవ్​కు చెందిన భూమిలోని ప్రహరీని మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా, కబ్జాదారులు తమ యజమాని భూమిలోని గోడను కూల్చుతున్నా పోలీసులు చూస్తున్నారే తప్ప ఏమీ అనడం లేదని వాచ్ మన్​ఎల్లయ్య వాపోయాడు. 

దీంతో ఆగ్రహానికి గురైన మేడిపల్లి ఎస్సై ప్రభాకర్​రెడ్డి.. ఎల్లయ్య మెడ, వీపుపై గుద్దుతూ వెహికల్​ఎక్కించి స్టేషన్​కు తరలించాడు. అనంతరం  పోలీసులు ఎల్లయ్యను ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లి టెస్టులు చేయించారు.