Ilayaraja: సోషల్ మీడియాలో స్వరకర్త ఇళయరాజా ఫోటో వాడొద్దు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Ilayaraja: సోషల్ మీడియాలో స్వరకర్త ఇళయరాజా ఫోటో వాడొద్దు.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

ప్రపంచ సినీ చరిత్రలో.. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) పేరు ఏంతో ప్రత్యేకం. మ్యూజిక్ మేస్ట్రో, ఇసైజ్ఞాని వంటి బిరుదులతో కీర్తించబడుతున్న సంగీత విద్వాంసుడు 'ఇళయరాజా' శైలి అందరిలో వినూత్నం. ఆయన తన పాటలపై ఎలా మనసుపెట్టి స్వరపరుస్తారో.. తనకు అన్యాయం జరిగితే కూడా అంతే స్థాయిలో విరుచుకుపడతారు. తన పాటల కాపీరైట్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తు, చట్టపరమైన పోరాటం చేస్తూనే వస్తున్నారు. ఈ విషయం చాలా సార్లు రుజువైంది. ఎందుకంటే, తన పాటలకు ఉండే క్రేజీ అలాంటింది.

ఈ క్రమంలోనే సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో తన అనుమతి లేకుండా తన ఫొటోను ఉపయోగించడాన్ని నిషేధించాలని ఇళయరాజా ముందుకొచ్చారు. AIతో తన ఫోటోను మార్ఫింగ్ చేసి, వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని మద్రాస్ హైకోర్టును ఇళయరాజా ఆశ్రయించారు. లేటెస్ట్గా ఇళయరాజా పిటిషన్ని విచారణ జరిపిన జస్టిస్ సెంథిల్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం, ఇళయరాజా వాదనలతో ఏకీభవించింది.

‘ఫేస్‌బుక్‌, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో.. ఇళయరాజా అనుమతి లేకుండా తన ఫోటోను వాడొద్దని కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని’ మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇళయరాజా.. దాదాపు 50 ఏళ్లుగా విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈయన తన 82 ఏళ్ళ వయస్సులో కూడా తనదైన సంగీతంతో, పాటలతో, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే, 1970, 1980, 1990ల నాటి తన పాటలను ఇప్పటికీ.. అంటే.. ఈ తరం మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకరిస్తూ తమ సినిమాల్లో వాడేస్తున్నారు. తన పాటల పవర్ ఎలాంటిదో ఊహించేసుకోవచ్చు. ఇపుడు తన ఫోటో కూడా వాడుకుంటున్నారని పిటిషన్ వేయడంతో తన ఇమేజ్ ఎంత విలువైనదో కూడా అంచనా వేసుకోవొచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.