
కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఆర్టికల్ 35A, 370ని ఏమైనా చేస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ముఫ్తీ. కేంద్ర ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే.. రాబోయే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతోందన్నారు ముఫ్తీ