మహబూబాబాద్, వెలుగు: విద్యాశాఖ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. శనివారం మహబూబాబాద్ కేజీబీవీ, జిల్లాపరిషత్, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్ వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
పిల్లల అభ్యసన సామర్ధ్యాలు, తరగతి గదులు, కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బలవర్ధకమైన ఆహార వస్తువులను అందిస్తూ వారి హెల్త్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
