ఈ టెస్ట్ చేస్తే గంజాయి తాగామా లేదో తెలుస్తుంది.. 4 వేల కిట్లు రెడీ చేసిన పోలీసులు

ఈ టెస్ట్ చేస్తే గంజాయి తాగామా లేదో తెలుస్తుంది.. 4 వేల కిట్లు రెడీ చేసిన పోలీసులు
  •     మహబూబాబాద్​  ఎస్పీ శబరీష్​

మహబూబాబాద్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు  ఎస్పీ శబరీష్ తెలిపారు.  జిల్లాకు 4వేల అత్యాధునిక  గంజాయి టెస్టింగ్ కిట్లు చేరాయని, అనుమానితులను పరీక్షిస్తే కేవలం 10 నిమిషాల్లో  రిపోర్ట్​ వస్తుందని  చెప్పారు.  దీంతో గంజాయి వినియోగదారులు, నిల్వదారులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికోసం డీ-అడిక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, రవాణా చేయడం ఎన్‌‌‌‌డీపీఎస్ చట్టం ప్రకారం నేరమని హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం 8712656999కు అందించాలని, జిల్లాను గంజాయి రహితంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్​ డీఎస్పీ తిరుపతి రావు, తొర్రూరు డిఎస్పీ క్రిష్ణ కిషోర్​ , తదితరులు పాల్గొన్నారు.