జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. మహబూబ్ నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా

జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి.. మహబూబ్ నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని మహబూబ్ నగర్  కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో వివిధ కుల సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు త్వరలోనే జిల్లా స్థాయి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గొడుగు ఆకారపు షెడ్ నిర్మించాలని, పూలమాలలు వేసేందుకు వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. వేడుకలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా సర్క్యులర్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.