కాణిపాకంలో మహాకుంభాభిషేక మహోత్సవం

కాణిపాకంలో మహాకుంభాభిషేక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ము ఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర పర్యాటక క్రీడలు, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునః నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. వేలాది భక్తుల నడుమ మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.