ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళలకు భరోసా సెంటర్స్

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళలకు భరోసా సెంటర్స్

మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళల కోసం భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని.. పోలీసులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. సిటీలో 60శాతం సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్ట్ తో క్రైమ్ కంట్రోల్  చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీస్ లో  షీ టీమ్స్, ఈ చలాన్స్, ఐటీఎంఎస్ కొత్త భవనాన్ని  ప్రారంభించారు హోం మంత్రి. తర్వాత.. సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో ... భరోసా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ మహేష్ భగవత్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.