మహానంది ఆలయంలో నాగు పాము ప్రత్యక్షం..

మహానంది ఆలయంలో నాగు పాము ప్రత్యక్షం..

మన దేశంలో రకరకాల సంప్రదాయాలు ఉంటాయి. ఆధ్యాత్మికత చింతనలో మనకు ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. దేశంలో చాలా ఆలయాలు రోజు తెరుస్తుంటారు.  విశేష దినాల్లో ఆలయాన్ని శుద్ది చేసి... నీళ్లతో కడిగి అలంకరిస్తారు. అలాగే నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయంలో  ఓ వింత ఘటన చోటు చేసుకుంది.  జూన్ 29 న తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. ఈ సమయంలో ఉత్తర ద్వారం దగ్గర ఓ నాగుపాము పడగవిప్పింది.  దీనిని గమనించిన ఆలయ సిబ్బంది దేవస్థానం అధికారులకు తెలియజేశారు.  వెంటనే అధికారులు అప్రమత్తమై పాములు పట్టే మోహన్ ను పిలిపించి అతని సాయంతో నల్ల త్రాచు నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకొని మహానంది దేవస్థానం వెనకాల అటవి ప్రాంతంలోనికి వదిలిపెట్టారు.