
హాస్టల్ లోని బాత్రూమ్ లో ఓ విద్యార్ధిని ప్రసవించిన ఘటన మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో జరిగింది. గత నెల ఫిబ్రవరి 29 న ఈ ఘోరం జరిగింది. జిల్లాలోని సాక్రీ పట్టణంలో సావిత్రిబాయి ఫులే ఆదివాసీ బాలికల హాస్టల్ లో ఓ యువతి పిల్లాడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డను టాయిలెట్‌లోని బకెట్‌లోనే వదిలేసి బయటకు వచ్చేసింది.
బాత్రూం నుంచి చిన్నపిల్లాడి ఏడుపు వినిపించడంతో హాస్టల్ వార్డెన్ అనుమానం వచ్చి లోపలకు వెళ్లగా.. బకెట్‌లోని పసికందును చూసి షాకైంది. వెంటనే హాస్టల్లోని విద్యార్థులను పిలిచి.. పాప ఎవరిదంటూ నిలదీసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సాక్రీ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవిదాస్ డామ్నే ఈ విషయంపై మాట్లాడుతూ.. ” దర్యాప్తులో ఓ విద్యార్ధిని పై అనుమానం వచ్చి వైద్య పరీక్షల కోసం చేయించామన్నారు. డాక్టర్ రిపోర్ట్ ఆ పిల్లవాడు ఆమెకు చెందినవాడేనని తేలడంతో చిన్నారి, విద్యార్థిని ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం ధులేలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు.