ఫిబ్రవరి 1నుంచి ముంబై లోకల్‌ రైళ్ళు

ఫిబ్రవరి 1నుంచి ముంబై లోకల్‌ రైళ్ళు

ముంబై నగర ప్రజలకు శుభవార్త తెలిపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి ముంబై నగరంలో లోకల్‌ రైళ్ళు నడపాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని రైల్వే బోర్డుకు పంపుతున్నామని, రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి, మధ్యామ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, తర్వాత రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. అలాగే షాపులను రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంచుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు రెస్టారెంట్లును నడుపుకోవచ్చని తెలిపింది మహారాష్ట్ర సర్కారు.