‘టైమ్’ లిస్టులో మహారాష్ట్ర ఆశా వర్కర్

‘టైమ్’ లిస్టులో మహారాష్ట్ర ఆశా వర్కర్
  • ‘2020 గార్డియన్ ఆఫ్​ ది ఇయర్’గా అర్చనా ఘుగారే

న్యూయార్క్: మహారాష్ట్రకు చెందిన ఆశా వర్కర్ అర్చనా ఘుగారే (41)కు టైమ్ మ్యాగజైన్ ‘2020 గార్డియన్ ఆఫ్​ది ఇయర్’ లిస్టులో చోటు దక్కింది. కరోనా విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ గా ఆమె ముందుండి చేసిన సేవలు ఎనలేనివని టైమ్ ప్రశంసించింది. ‘‘ఇండియాలోని గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ విషయంలో దాదాపు10 లక్షల మంది ఆశా వర్కర్లు కీలకంగా పని చేశారు. కరోనా రాకముందు అర్చన రోజుకు ఐదారు గంటలు డ్యూటీ చేసేది. కానీ ఈ విపత్తు మొదలైన తర్వాత.. ఆమె రోజుకు12 గంటలు.. అలసిపోయినా కూడా కంటిన్యూగా పని చేసింది. ప్రభుత్వం కేవలం రూ. వెయ్యి కొవిడ్ బోనస్ మాత్రమే ఇచ్చింది. నలుగురు ఉన్న ఆమె కుటుంబానికి అది రెండు వారాలకు సరిపడా సరుకులు కొనేంత మాత్రమే. అయినా అర్చనతో పాటు లక్షలాది ఆశా వర్కర్లు చేసిన సేవలు చాలా గొప్పవి”అని టైమ్ మ్యాగజైన్ మెచ్చుకుంది. కాగా, ‘2020 పర్సన్ ఆఫ్​ది ఇయర్’గా జోబైడెన్, కమలా హారిస్ లను.. హీరోస్ ఆఫ్ 2020’లిస్టులోకి ఇండో అమెరికన్ రాహుల్ దూబే, తదితరులను టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. గార్డియన్ ఆఫ్​ది ఇయర్ లిస్టులో ప్రముఖ అమెరికన్ ఫిజిషియన్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీతో పాటు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లను ఎంపిక చేసింది.