
తెలంగాణ అసెంబ్లీలో ఓటమితో జంపింగ్ జపాంగ్ లు బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అధినేత మౌనంగా ఉండటంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. లేటెస్ట్ గా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ పదవికి మానిక్ రావ్ కదం రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మానిక్ రావ్ కదం ఎన్సీపీలో చేరారు. మానిక్ రావ్ కు రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఎన్సీపీ.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రావడడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కు లేటర్లు రాస్తున్నారు. వారం రోజుల కిందటే హై కమాండ్ కు లెటర్ రాసినా అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బరిలో ఉండాలా లేదా అనే అంశాలపై మహారాష్ట్ర లీడర్లు లేటర్లతో పాటు ఆడియో రికార్డింగ్ లు వైరల్ చేస్తున్నారు.