రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ

రెబల్ ఎమ్మెల్యేలకు ఉద్దవ్ లేఖ

గౌహతిలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే లేఖ రాశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని ఉద్ధవ్  అ లేఖలో కోరారు.  " మీ నుంచి మాకు సమాచారం అందుతుుంది. మీలో చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు. మీరంతా శివసైనికులే.. మీ మనోభావాలను తప్పకుండా గౌరవిస్తాం.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం.  మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నాన్నారు. ఎవరి వాదనలకు లొంగవద్దు. శివసేన ఇచ్చిన గౌరవం మీకు మరెక్కడా లభించదు" అని ఉద్దవ్ తన లేఖలో  పేర్కొన్నారు. అటు తనవైపు 50 మంది ఎమ్మెల్యేలున్నారని,  వారితో కలిసి త్వరలోనే ముంబై వెళ్తానని శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే  తెలిపారు.   మ‌హారాష్ట్ర గ‌వ‌ర్నర్ భ‌గ‌త్ సింగ్‌తోనూ మాట్లాడ‌నున్నట్లుగా వెల్లడించారు.