మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. 288స్థానాలకు గాను ఇప్పటివరకు 189స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుంది. నాగ్ పూర్ నుంచి బరిలోవున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు… కార్యక్తలకు, అభిమానులకు పంచడానికి లడ్డూలను అందుబాటులో ఉంచారు.
