క్రికెట్‌‌ ఫ్యాన్స్​కు గుడ్‌‌ న్యూస్‌‌

క్రికెట్‌‌ ఫ్యాన్స్​కు గుడ్‌‌ న్యూస్‌‌

ముంబై: క్రికెట్‌‌ ఫ్యాన్స్​కు గుడ్‌‌ న్యూస్‌‌. ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లను స్టేడియంలో నేరుగా చూసేందుకు లైన్‌‌ క్లియర్‌‌ అయ్యింది.  ఏప్రిల్‌‌ 15 వరకు 25 శాతం మంది ఫ్యాన్స్‌‌ను అనుమతించేందుకు మహారాష్ట్ర గవర్నమెంట్‌‌ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. బుధవారం బీసీసీఐ, ముంబై క్రికెట్‌‌ అసోసియేషన్‌‌తో జరిగిన సమావేశంలో మంత్రి ఆదిత్య థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగా లీగ్‌‌లో పాల్గొనే 10 జట్లు ప్రాక్టీస్‌‌ చేసుకునేందుకు వీలుగా ఐదు గ్రౌండ్స్‌‌ను గుర్తించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌‌, ఎంసీఏ గ్రౌండ్‌‌ (థానే), డీవై పాటిల్‌‌ యూనివర్సిటీ గ్రౌండ్‌‌ అండ్‌‌ ఫుట్‌‌బాల్‌‌ పిచ్‌‌, సీసీఐ గ్రౌండ్‌‌, రిలయన్స్‌‌ కార్పొరేట్‌‌ పార్క్‌‌ గ్రౌండ్‌‌ (ఘన్‌‌సోలీ) ఇందులో ఉన్నాయి. ఈ నెల 7, 8న అన్ని జట్లు ముంబైకు చేరుకోనున్నాయి. రూల్స్​ ప్రకారం  ఐదు రోజుల వరకూ క్వారంటైన్‌‌లో ఉండాలి. ఆ తర్వాత బీసీసీఐ ఏర్పాటు చేసిన బబుల్‌‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఐసోలేషన్‌‌లో ఒకటి, మూడు, ఐదో రోజు ఆర్టీపీసీఆర్‌‌ టెస్ట్‌‌లు చేస్తారు. 14 లేదా 15 నుంచి ట్రెయినింగ్‌‌ను మొదలుపెట్టనున్నాయి.